మన ఆటలు 1 కాళ్ళాగజ్జ కంకాలమ్మ
మన ఆటలు - ఆడపిల్లలు ఒకనాడు ఎంతో ఇష్టంగా ఆడే ఆటలివి . 1. కాళ్ళాగజ్జీ కంకాళమ్మ వేగు చుక్కా వెలగామొగ్గా మొగ్గా కాదూ మోదుగబావి నీరు నీరూ కాదూ నిమ్మల వారీ వారీ కాదూ వావింటాకు ఆకూ కాదూ గుమ్మడి పండూ పండు కాదు పాపడ మీసం మీసం కాదు మిరియాల పోతు పోతు కాదు బొమ్మల శెట్టి శెట్టి కాదు శామ మన్ను మన్ను కాదు మంచి గంధం ముత్యంబియ్యం మూలగా చారు ఆకువక్కా అరటిపండు కాల్దీసి కడగా పెట్టు కామాక్షమ్మా. ఇక, ఈ పాట ఎంతో నిగూఢమైన అర్ధంతో వుంది. గజ్జి వచ్చినప్పుడు కంకోలం అనే ఆకును రుబ్బి పూయాలి. తగ్గక పోతే వేకువ ఝామున లేత వెలక్కాయలోని గుజ్జును పూయాలి. దానికీ తగ్గక పోతే మోదుగ ఆకును రుబ్బి పూయాలి. తగ్గడం ప్రారంభించాక నిమ్మరసాన్ని బాగా పలచన చేసి కడగాలి. ఇంకా మాడక పోతే వావింటాకు పూయాలి. గుమ్మడి పండులోని గుజ్జు కూడా గజ్జికి మందే. అదేవిధంగా ఏర్పడిన మచ్చలు పోవాలంటే మన్ను, మంచి గంధం ఎంతో ఉపకరిస్తాయి. ఆ తరువాత జీర్ణప్రక్రియ సరిగా ఉండటానికి చారన్నం, అరటిపండు మరియు తాంబూలం కూడా అవసరం అని చెప్పి ఈ చికిత్సా విధానాలన్నిటినీ సూక్ష్మంలో మోక్షం లాగ వివరించే పాట ఇది. కాలు తీసి కడగా పెట్టు అనడంలో ...