Posts

Showing posts from December, 2017
Image
# జామకాయపచ్చడి .  జామకాయ పచ్చడి చేసుకుందామనిపించింది . సాయంత్రం చేసే అవకాశం వచ్చింది.  1.ఒక పచ్చిజామకాయ తీసుకుని ముక్కలు చేసుకున్నాను. 2.స్టో మీద మూకుడు పెట్టి ఒక చంచాడు నూనె వేసి ఆ ముక్కలు అందులో వేసేను. 3.అవి కొద్దిగా వేగినవెంటనే కొద్దిగా చింతపండు చింతపండు, ఉప్పు వేసి మూతపెట్టేను. 4.రెండు నిమిషాల తరువాత చిటికెడు మెంతికారం, ఎర్రకారం వేసేసి మూతపెట్టేను. 5.ఇంకో రెండు నిమిషాల తరువాత దింపి చిన్న రోలులో ఆ మిశ్రమాన్ని వేసి దంపి ఆవాలు మెంతులు,కరివేపాకు,చిటికెడంత ఇంగువలతో పోపు పెట్టేను . వేడివేడి అన్నంలో కలుపుకుని తింటుంటే భలే ఉంది. <3 span="">  రోట్లో వేసి దంపినందువలన రుచి మస్తుంది. మీరూ ఓసారి చేసుకుని తినేసి చెప్పండి