Posts

Showing posts from August, 2017

Achantagopalakrishna: అరటి పువ్వు ఆవ పెట్టి కూర

Image
  అరటిపువ్వు కూర:: అరటిపువ్వు — ఒకటి పసుపు — ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు — 8 పచ్చిమిరపకాయలు — 10 జీడిపప్పులు — 15 సెనగ పప్పు — ఒక టేబుల్ స్పూన్ మినపపప్పు — అర టేబుల్ స్పూన్ ఆవాలు — అర టీ స్పూన్ మెంతులు — 4 గింజలు ఇంగువ — పావు టీ స్పూన్ ఉప్పు — ఒక టీ స్పూన్ చిన్తపండురసం — ఒక టేబుల్ స్పూన్ ఆవపొడి — అర టీ స్పూన్ కరివేపాకు — 4రెమ్మలు నూనె — ఒక టేబుల్ స్పూన్ తయారుచేసే విధానం ;- ముందుగ అరటిపువ్వు ను వొలిచి ,అరటిపువ్వు లోని సన్నగా పొడవుగా వుండే పువ్వుల మధ్యలోని చందమామను ,అంగుళం పొడవుగా వుండే పొర ను తీసేయాలి . ఈ పని చాల టైం తీసుకుంటుంది . అలా మొత్తం పువ్వును బాగుచేసుకుని గ్రైన్దర్ లో వేసి ,పసుపు ,నూనె వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి . తరవాత అందులో చెడు,వగరు పోయే వరకు నీళ్ళు పోసి బాగా కడగాలి . కడిగిన తరువాత ఒక గిన్నెలో వేసి మునిగే వరకు నీళ్ళు పోసి ఉప్పు వేసి మెత్తగా ఉడకబెట్టాలి . ఉడికిన అరటిపువ్వు ను నీళ్ళు లేకుండా గట్టిగ పిండేసి పక్కన పెట్టుకోవాలి . ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి సెనగపప్పు ,మినప