Achantagopalakrishna: అరటి పువ్వు ఆవ పెట్టి కూర

 అరటిపువ్వు కూర::

అరటిపువ్వు — ఒకటి
పసుపు — ఒక టీ స్పూన్
ఎండుమిరపకాయలు — 8
పచ్చిమిరపకాయలు — 10
జీడిపప్పులు — 15
సెనగ పప్పు — ఒక టేబుల్ స్పూన్
మినపపప్పు — అర టేబుల్ స్పూన్
ఆవాలు — అర టీ స్పూన్
మెంతులు — 4 గింజలు
ఇంగువ — పావు టీ స్పూన్
ఉప్పు — ఒక టీ స్పూన్
చిన్తపండురసం — ఒక టేబుల్ స్పూన్
ఆవపొడి — అర టీ స్పూన్
కరివేపాకు — 4రెమ్మలు
నూనె — ఒక టేబుల్ స్పూన్
తయారుచేసే విధానం ;-
ముందుగ అరటిపువ్వు ను వొలిచి ,అరటిపువ్వు లోని సన్నగా పొడవుగా వుండే పువ్వుల మధ్యలోని చందమామను ,అంగుళం పొడవుగా వుండే పొర ను తీసేయాలి . ఈ పని చాల టైం తీసుకుంటుంది . అలా మొత్తం పువ్వును బాగుచేసుకుని గ్రైన్దర్ లో వేసి ,పసుపు ,నూనె వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి . తరవాత అందులో చెడు,వగరు పోయే వరకు నీళ్ళు పోసి బాగా కడగాలి . కడిగిన తరువాత ఒక గిన్నెలో వేసి మునిగే వరకు నీళ్ళు పోసి ఉప్పు వేసి మెత్తగా ఉడకబెట్టాలి . ఉడికిన అరటిపువ్వు ను నీళ్ళు లేకుండా గట్టిగ పిండేసి పక్కన పెట్టుకోవాలి . ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి సెనగపప్పు ,మినపపప్పు ,జీడిపప్పు ,ఆవాలు ,మెంతులు ,ఇంగువ ,పసుపు ,ఎండుమిరప ముక్కలు వేసి పోపును దోరగా వేయించాలి . వేగిన పోపులో పచ్చిమిరప ముక్కలు ,కరివేపాకు వేసి ఐదు నిముషాలు ఆగి చింతపండు రసం పోసి కొద్దిగా ఉడకనిచ్చి పక్కన పెట్టిన అరటి పువ్వును వేసి బాగా కలపాలి . రసం మొత్తం ఇగిరిపోయి కూర పాడి పొడిగా అయ్యేవరకు ఉంచి స్టవ్ మీద నుంచి దించేయాలి . ఇప్పుడు ఆవపిండిని కూరలో చల్లి బాగా కలపాలి . అంతే ఘుమఘుమ లాడే అరటి పువ్వు కూర రెడీ.
Achantagopala Krishna గారి సౌజన్యం.సంబంధిత చిత్రం

Comments

Popular posts from this blog

ఆరోగ్యం- పప్పులు.

నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని