ఇద్దరి మధ్యా దూరం పెరిగిపోతుందని భ్రమపడుతుంటావు కాని
దగ్గరగా ఉన్న మనం మనం  గా గడిచిన
అపురూప క్షణాలను ఏం చేస్తావు1

వెలకట్టలేని భావాలను 
పంచుకున్న మనసులు
కనపించని వ్యధలను
సృష్టించుకుంటూ
మనల్ని మనమే మోసగించుకోవడం
మానవ నైజంకనే కాదు !

ఇద్దరి ఆలోచనలూ వేరైన
మనదైన లోకంలో ఒక్కటిగా విహరిస్తూ
గడిచిన క్షణాలన్నింటిని
ఒక్కసారి దోసిలిలోకి ఒడిసిపడితే..

వేళ్ళ సందుల్లోంచి జ్ఞాపకాలు జారిపోతాయేమోనని
మన అంతులేని ప్రేమను అడ్డుగా వేశా...అయిన నువ్వు జారిపోతున్నవుగా :'( 


Comments

Popular posts from this blog

Achantagopalakrishna: అరటి పువ్వు ఆవ పెట్టి కూర

ఆరోగ్యం- పప్పులు.