నీవుంటే నాకు విజయాలు వరిస్తాయి. నీవంటూ లేకుంటే అపజయాలు వెక్కిరిస్తాయి..

నీ కన్నుల కాంతిలో ఉదయాలు కన్పిస్తాయి. 
నీ సవ్వడిలో కోయిల రాగాలు వినిపిస్తాయి.
నీ సానిహిత్యంలో వసంతాలు దరికొస్తాయి.
నీ కోసం నిరీక్షణలో యుగాలు క్షణమవుతాయి.

నీ తలపుతోటి మనసుకు రెక్కలొస్తాయి.నీ పిలుపుతోటి మది భావాలు వెలికొస్తాయినీవుంటే నాకు విజయాలు వరిస్తాయి.
నీవంటూ లేకుంటే అపజయాలు వెక్కిరిస్తాయి..


నిశీధిని తరిమేసేందుకు మినుకుమంటూ ప్రయత్నించే మిణుగురులా...
ఆశ చావని నా ప్రాణం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

ఎవరెన్ని చెప్పినా వినని మూర్ఖుడిలా...
నా మనసు నీకోసమే తపిస్తూ ఉంటుంది.
భూమి ఆకాశాలు ఒకటైనా సాగరాలన్నీ ఏకమైనా...
నిను వలచిన నా హృదయం నీకోసమే వేచి ఉంటుంది....

Comments

Popular posts from this blog

Achantagopalakrishna: అరటి పువ్వు ఆవ పెట్టి కూర

ఆరోగ్యం- పప్పులు.