నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని

నీ ప్రతి తలపు నాకొక గెలుపై సుఖాలు తొణికెనులే
నీ శృతి తెలిపే కోయిల పిలుపే తథాస్తు పలికెనులే
గగనములా మెరిసి మెరిసీ పవనములా మురిసి మురిసీ
నిను కలిసే క్షణము తలచీ అలుపు అనే పదము మరచీ
వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే ......
కమ్మగా పాడే కోయిలనడిగాను, నీ తీయని మాటలతో నను మురిపించేది ఎపుడని
చల్లగా వీచే చిరుగాలిని అడిగాను , నీ చల్లని చూపుతో నను తాకేది ఎపుడని...
వర్షించే మేఘాన్ని అడిగాను , నీ నవ్వుల జల్లుల్లో నను తడిపేది ఎపుడని ...
హాయిని పంచే వెన్నెలని అడిగాను , ఆ వెన్నల్లో హాయిగా ఊసులడేది ఎపుడని ...
పరుగులు తీస్తున్న సెలయేటిని అడిగాను , నీ పరుగు నా కోసమేనా అని ...
నాలో ఉన్న నా ప్రాణమైన నీకు తెలిపాను , నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని.

Comments

Popular posts from this blog

Achantagopalakrishna: అరటి పువ్వు ఆవ పెట్టి కూర

ఆరోగ్యం- పప్పులు.