కనుమూసిన నయనపు చీకటి మసగకు వెలుగును పంచే ప్రేమ నిధీ
చిగురాకుల సొబగుల జాబిలి పలుకుల చెలిమిని చేర్చే మానస సఖీ !
పరిమళ పువ్వుకు నవ్వును నేర్పిన పాలబుగ్గల కవితల నిధీ
తలపులసిగ్గును వలపుల మొగ్గగ మార్చిన వన్నెల ప్రియతమ సఖీ !
చల్లని వెన్నెల,పూల సుగంధపు ప్రణయపు మధువుకు మాటలు
నేర్పిన పదముల నిధీపిల్లతెమ్మెరల, కోయిల పాటల శ్రావ్య గళపు మాధురి తెలిపిన
గాన సఖీ !
మందహాసమున శాంతిని కలిపి బృందరీతులను ఆదరించినా స్నేహనిధీ
కలిమి లేములకు చెలిమిని చేర్చి గృహమున ప్రేమ వెలుగునే పంచిన లావణ్య సఖీ !
ఎదయెదలను కలిపి, అధరపు మధువును ప్రేమగ పంచి స్వర్గపు తలుపులు తెరిపించు
నా యవ్వన నిధీ!
కరముల స్పర్శను కలిపి, మాతృత్వపు మాధుర్యము తెలిపి
గంధపు వర్ణపు కోవెల దేవతగ కనిపించు నా జీవిత సఖీ !


ఎచాడున్నావు నా సఖీ, కానారావా  ఓ పరి 

Comments

Popular posts from this blog

Achantagopalakrishna: అరటి పువ్వు ఆవ పెట్టి కూర

ఆరోగ్యం- పప్పులు.