జామకాయ పచ్చడి చేసుకుందామనిపించింది . సాయంత్రం చేసే అవకాశం వచ్చింది. 
1.ఒక పచ్చిజామకాయ తీసుకుని ముక్కలు చేసుకున్నాను.
2.స్టో మీద మూకుడు పెట్టి ఒక చంచాడు నూనె వేసి ఆ ముక్కలు అందులో వేసేను.
Image may contain: food and text
3.అవి కొద్దిగా వేగినవెంటనే కొద్దిగా చింతపండు చింతపండు, ఉప్పు వేసి మూతపెట్టేను.
Image may contain: food and text
4.రెండు నిమిషాల తరువాత చిటికెడు మెంతికారం, ఎర్రకారం వేసేసి మూతపెట్టేను.
5.ఇంకో రెండు నిమిషాల తరువాత దింపి చిన్న రోలులో ఆ మిశ్రమాన్ని వేసి దంపి ఆవాలు మెంతులు,కరివేపాకు,చిటికెడంత ఇంగువలతో పోపు పెట్టేను .Image may contain: food
వేడివేడి అన్నంలో కలుపుకుని తింటుంటే భలే ఉంది.
 రోట్లో వేసి దంపినందువలన రుచి మస్తుంది.
మీరూ ఓసారి చేసుకుని తినేసి చెప్పండి

Comments

Popular posts from this blog

ఆరోగ్యం- పప్పులు.

నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని