Posts

Showing posts from July, 2016
ఇష్టం,ప్రేమ,ఆరాధన,వ్యామోహమో కాదు.. నువ్వు నా వ్యసనం,వ్యవహారికం.. బంధం,అనుబంధం,బంధుత్వం,సహగమనం కాదు.. నువ్వు నా సమస్తం, సహజీవనం.. ఎలా చెప్పను నువ్వే నేనని.. నీకోసమే ఉన్నానని.. ఇంకెలా చెప్పను..నీ తోడులేక నేను ఓ జీవచ్చవమై వెళ్లదీస్తున్నా అని. మనసెందుకో ఒంటరయ్యింది.. మన అనే తోడు మాయమయ్యింది.. జత లేక జాగరణ అలవాటయ్యింది.. జలతారు వెన్నెల జాలితో జారిపోయింది.. ప్రేమా.. నీ దాహం నాలో ఇంకా తీరలేకుంది.. అయినా నీ మోహం నాపై పడలేకుంది.. నా కల ఇప్పటికీ నిజమై నిలవలేకుంది.. నీ రూపుగా నా ఎదురుగా చూపలేకుంది.        x
కారు మబ్బులు కురులు కలువ తామరలు కనులు పున్నమి వెన్నెల మోము పురివిప్పిన నెమలి నడక నెలవంకనే విరిమల్లెలుగా  తన కురులలో నిలుపుకుందేమో ఆ రవినే కుంకుమబొట్టుగా తన నుదుట దాచిందేమో ఏ కవి భావనకు  అంతుబట్టని కావ్యం ఆమె ఏ చిత్రకారుని కుంచెకు అంతుచిక్కని చిత్రం ఆమె.