ఇష్టం,ప్రేమ,ఆరాధన,వ్యామోహమో కాదు..
నువ్వు నా వ్యసనం,వ్యవహారికం..
బంధం,అనుబంధం,బంధుత్వం,సహగమనం కాదు..
నువ్వు నా సమస్తం, సహజీవనం..
ఎలా చెప్పను నువ్వే నేనని.. నీకోసమే ఉన్నానని..
ఇంకెలా చెప్పను..నీ తోడులేక నేను
ఓ జీవచ్చవమై వెళ్లదీస్తున్నా అని.

మనసెందుకో ఒంటరయ్యింది..

మన అనే తోడు మాయమయ్యింది..
జత లేక జాగరణ అలవాటయ్యింది..
జలతారు వెన్నెల జాలితో జారిపోయింది..
ప్రేమా..
నీ దాహం నాలో ఇంకా తీరలేకుంది..
అయినా నీ మోహం నాపై పడలేకుంది..
నా కల ఇప్పటికీ నిజమై నిలవలేకుంది..
నీ రూపుగా నా ఎదురుగా చూపలేకుంది.      

x

Comments

Popular posts from this blog

Achantagopalakrishna: అరటి పువ్వు ఆవ పెట్టి కూర

ఆరోగ్యం- పప్పులు.