అన్నమాచార్య సంకీర్తనలు : తే శరణమహం .
68.త. తే శరణమహం తే శరణమహం శైశవకృష్ణ తే శరణం గతోస్మి|| దశవిధావతార ధర్మరక్షణమూర్తి దశమస్తకాసురదశన దశదిశాపరిపూర్ణ తవనీయస్వరూప దశావరణ లోకతత్త్వాతీత || సహస్రలోచన సంతతవినుత సహస్రముఖ శేషశయనా సహస్రకరకోటిసంపూర్ణతేజా సహస్రాదిత్య దివ్యచక్రాయుధా || అనంతచరణ సర్వాధారధేయ అనంతకరదివ్యాయుధా అనంతనిజకల్యాణగుణార్ణవ అనంత శ్రీవేంకటాద్రినివాసా ||