Posts

Showing posts from January, 2017
Image
చల్లని వెన్నెల స్పర్శకు మురిసిన కలువ రేకులు ఎదను తడిమి మత్తును జల్లగా....! మూతపడిన కన్నుల కలలో విరిసిన నీ సుందర రూపం, తారల అలలా నేల జారగా...! మూగమనసుల అసహజ పరిమళాలు, గూడు చేసుకున్నబాసలు ఆలపించలేని హిందోళరాగాలు; వెనుతిరిగిన క్షణాల మెలికల ఆల్లికలో ఓ వయనం చొరవచూపి . ఏకాంతముగా మదినల్లుకున్నరాతిరి సందేశాలు, రాసిన ప్రేమ పుస్తకం చదివిన మనసు ఒంపిన జ్ఞాపకాల మెరుపులు ...నివేదిస్తున్న మౌన సంతకాలు మిగిల్చిన అక్షర నీరాజనపు గురుతులు చెరగని ఊహావెశపు మధురిమల మౌనముద్రలు లెక్కపెడుతున్న, కాంతి లేఖల కలువ కాగితాల పై ఏ నిమిషమో తిరిగి విరచించనా అలనాటి మన ప్రేమకధ మౌనంగా ఓ హృదయమా ...అనుకుంటూ నిన్నూహిస్తూ నే రాస్తున్నప్రతి ప్రేమకావ్యమూ చరిత్రలు చూడని సువర్ణ ద్వీపములో, ఇరువురి సప్త జన్మల సాన్నిహిత్యానికి ..... వారధి కడుతూ జన్మజన్మకి నిన్నే ఆరాధిస్తున్నా .
Image
కరిగిపోలేదు నీ జ్ఞాపకం కాలం తిరిగొస్తే ఎంత బాగుణ్ణు నిను తలచి తలచి నిలిచిపోతే నీ తీయటి జ్ఞాపకానికి విలువలేదు . ఆగిపోదెన్నడూ వర్తమానములో కూడా నీ వందించిన జ్ఞాపకం '' అయినా తిరిగిరాని వాటి మీదే నాకెందుకింత ఆరాటం , కష్టమయినా సుఖఃమయినా నీ వందించిన తీయటి జ్ఞాపం మరుపురాకున్నదీ