చల్లని వెన్నెల స్పర్శకు మురిసిన కలువ రేకులు ఎదను తడిమి మత్తును జల్లగా....!
మూతపడిన కన్నుల కలలో విరిసిన నీ సుందర రూపం, తారల అలలా నేల జారగా...!





మూగమనసుల అసహజ పరిమళాలు, గూడు చేసుకున్నబాసలు ఆలపించలేని హిందోళరాగాలు;
వెనుతిరిగిన క్షణాల మెలికల ఆల్లికలో ఓ వయనం చొరవచూపి .
ఏకాంతముగా



మదినల్లుకున్నరాతిరి సందేశాలు, రాసిన ప్రేమ పుస్తకం చదివిన మనసు
ఒంపిన జ్ఞాపకాల మెరుపులు ...నివేదిస్తున్న మౌన సంతకాలు



మిగిల్చిన అక్షర నీరాజనపు గురుతులు చెరగని ఊహావెశపు మధురిమల మౌనముద్రలు లెక్కపెడుతున్న,
కాంతి లేఖల కలువ కాగితాల పై ఏ నిమిషమో తిరిగి విరచించనా అలనాటి మన ప్రేమకధ



మౌనంగా ఓ హృదయమా ...అనుకుంటూ నిన్నూహిస్తూ నే రాస్తున్నప్రతి ప్రేమకావ్యమూ చరిత్రలు చూడని
సువర్ణ ద్వీపములో, ఇరువురి సప్త జన్మల సాన్నిహిత్యానికి .....
వారధి కడుతూ జన్మజన్మకి నిన్నే ఆరాధిస్తున్నా .

Comments

Popular posts from this blog

Achantagopalakrishna: అరటి పువ్వు ఆవ పెట్టి కూర

ఆరోగ్యం- పప్పులు.