Posts
Showing posts from May, 2017
- Get link
- X
- Other Apps
చక్కటి ఔషధం వెల్లుల్లి వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. గాయాలకు, చర్మ వ్యాధులకు, ఫ్లూ, అల్సర్, రక్తపోటు, పెద్దపేగు క్యాన్సర్, జలుబు, మూత్రపిండాల వ్యాధులకు, బ్లాడర్ సమస్యలకు వెల్లుల్లి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లితో చేసుకున్న సిరప్ దగ్గుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. మరిగే నీళ్లలో చిన్న వెల్లుల్లి ముక్క వేసి పన్నెండు గంటల పాటు నానబెట్టాలి. తరువాత కొంచెం పంచదార కలుపుకుని తీసుకుంటే దగ్గు ఇట్టే మాయమవుతుంది. రుచిగా ఉండాలని కోరుకునే వారు కొంచెం తేనెను కలుపుకోవచ్చు. గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారు వెల్లుల్లి కలిపిన టీ తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వెల్లుల్లి ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో సహాయపడుతుంది. చెవిపోటుతో బాధపడేవారు వెల్లుల్లి ముక్కను తీసుకుని ఆలివ్ ఆయిల్‌తో కలిపి వేడి చేసుకుని మిశ్రమం చల్లారిన తరువాత చెవిలో వేసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి తెగిన చోట, గాయాలకు రాసుకోవచ్చు. చర్మం ఎర్రగా మారి ఇరిటేషన్‌తో బాధపడుతున్న వారు, ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు వెల్లుల్లి పేస్టు రాసుకుంటే నయమవుతుంది. వెల్లుల్ల...