చక్కటి ఔషధం వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. గాయాలకు, చర్మ వ్యాధులకు, ఫ్లూ, అల్సర్, రక్తపోటు, పెద్దపేగు క్యాన్సర్, జలుబు, మూత్రపిండాల వ్యాధులకు, బ్లాడర్ సమస్యలకు వెల్లుల్లి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.
వెల్లుల్లితో చేసుకున్న సిరప్ దగ్గుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. మరిగే నీళ్లలో చిన్న వెల్లుల్లి ముక్క వేసి పన్నెండు గంటల పాటు నానబెట్టాలి. తరువాత కొంచెం పంచదార కలుపుకుని తీసుకుంటే దగ్గు ఇట్టే మాయమవుతుంది. రుచిగా ఉండాలని కోరుకునే వారు కొంచెం తేనెను కలుపుకోవచ్చు. గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారు వెల్లుల్లి కలిపిన టీ తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వెల్లుల్లి ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో సహాయపడుతుంది.
చెవిపోటుతో బాధపడేవారు వెల్లుల్లి ముక్కను తీసుకుని ఆలివ్ ఆయిల్‌తో కలిపి వేడి చేసుకుని మిశ్రమం చల్లారిన తరువాత చెవిలో వేసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి తెగిన చోట, గాయాలకు రాసుకోవచ్చు. చర్మం ఎర్రగా మారి ఇరిటేషన్‌తో బాధపడుతున్న వారు, ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు వెల్లుల్లి పేస్టు రాసుకుంటే నయమవుతుంది. వెల్లుల్లి నూనెను పన్ను నొప్పి ఉన్న చోట పెడితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
రోగనిరోధక వ్యవస్థ
రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరచడంలో వెల్లుల్లి బాగా ఉపకరిస్తుంది. తెల్ల రక్తకణాలు మరింత సమర్థంగా పోరాడటానికి అవసరమైన శక్తిని అందించడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.
క్యాన్సర్
వెల్లుల్లిలో క్యాన్సర్‌ను నివారించే ఔష«ధ గుణాలున్నాయి. క్యాన్సర్ కణాలపై పోరాడే శక్తిని వెల్లుల్లి పెంచుతుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ, బ్రెస్ట్, ప్రోస్టేట్ గ్రంధి క్యాన్సర్‌ల కణాలపైన ఎక్కువ ప్రభావం చూపుతుంది.
అధిక రక్తపోటు
వెల్లుల్లికి, అధిక రక్తపోటుకి సంబంధం ఉంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో వెల్లుల్లి ఉపకరిస్తుంది. క్రమంతప్పకుండా వెల్లుల్లిని తీసుకునే వారిలో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
కొలెస్టరాల్, గుండె ఆరోగ్యం
అధిక రక్తపోటును నియంత్రించడం ద్వారా వెల్లుల్లి గుండెను కాపాడుతుంది. చెడు కొలెస్టరాల్‌ను తగ్గించడంలోనూ వెల్లుల్లి సహాయపడుతుంది. వెల్లుల్లి వినియోగం ఎక్కువగా ఉన్న దేశాల్లో గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు వెల్లడయింది. రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. గుండెను పదిలంగా ఉంచడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.
ఇతర ఉపయోగాలు కలరా, నులిపురుగులు, విరేచనాలు, స్మాల్‌ఫాక్స్, ధనుర్వాతం, క్షయ, టైఫాయిడ్ తదితర వ్యాధులకు కూడా వెల్లుల్లి ఔషధంగా పనిచేస్తుంది.
సేకరణ.

Comments

Popular posts from this blog

Achantagopalakrishna: అరటి పువ్వు ఆవ పెట్టి కూర

ఆరోగ్యం- పప్పులు.