హయ్ ఫ్రెండ్స్ ... ప్రేమికులరోజు మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకుని ప్రేమించానని చెప్పెస్తే జీవితాంతం ప్రేమ ఉన్నట్టేనా, కాదని నేననుకుంటాను ... నిజమైన ప్రేమ ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ మనసులోనే ఉంటుంది, మనసంతా ఉంటుంది ... ప్రేమ = రెండక్షరాలు, అది మూడు ముళ్లై, ఏడడుగులుగా నిలవాలంటే కావలసింది ఇద్దరు మనుషులు మాత్రమే కాదు ఇష్టం, అభిమానం, నమ్మకం అన్నిటిని మించి ప్రేమతో నిండిన రెండు మనసులు ... రెండు మనసుల కలయిక ప్రేమ. ప్రేమకు ప్రేమించే మనసుతో పాటు ఆలోచన, ధైర్యం అన్నిటిని మించి నమ్మకం కావాలి ... మంచి చేస్తే అందరూ అభినందిస్తారు కాని తప్పు చేసినా కూడా మందలించేది, ప్రేమించేది నా అనుకునే మన వాళ్ళు మాత్రమే, అవునా కాదా ప్రేమికులారా, నా పెళ్ళి జరగబోతుంది ఇంకో రెండు నెలల్లో. పెళ్లి తరువాత నీ ప్రపంచం మారనివ్వను నీ ప్రపంచంతో పాటే నిన్ను ప్రేమించాను అని తను నమ్మకంగా చెబుతూ ఉన్నా కూడా ఎందుకో ఏదో బెంగ.చుట్టూ ఉన్న పరిస్థితులు ఎపుడూ తనని ఇలాగే ఉండనివ్వవేమో అనే బెదురు.మీ నాన్న చనిపోయాక నువ్వు తప్ప వేరే ప్రపంచం నాకు తెలియదు నువ్వు వెళ్లిపోయాక ఎలా ఉండాలో అని అమ్మ చెమ్మగిల్లిన తన కళ్లను తుడుచుకుంటుం...
Popular posts from this blog
ఆరోగ్యం- పప్పులు.
వ పప్పుధాన్యాలు:- . కప్పు పప్పు ద్వారా పద్దెనిమిది నుంచి ఇరవైగ్రాముల మాంసకృత్తులు అందుతాయి. సెనగలు:- వీటిల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. పీచుతోపాటూ ఆరోగ్యానికి మేలుచేసే కొలెస్ట్రాల్ని అందిస్తాయివి. వీటిలో మెగ్నీషియం, ఇనుము, క్యాల్షియం, జింక్ లాంటి పోషకాలుంటాయి. ఇవి ఎముకలకు మేలుచేస్తాయి. కప్పు సెనగలు తీసుకుంటే 18 నుంచి 22 గ్రాముల మాంసకృత్తులు అందుతాయి. సోయా: - సోయాలో ప్రొటీన్శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అదనంగా మరికొన్ని ఖనిజాలూ, విటమిన్లూ ఉంటాయి. ఈ గింజల్లో ఉండే పీచు జీర్ణవ్యవస్థ పనితీరు సజావుగా సాగేందుకు తోడ్పడుతుంది. కప్పు సోయా గింజల్ని తీసుకుంటే రోజువారీ అవసరాలకు సరిపడే ప్రొటీన్లు శరీరానికి అందుతుంది. సేకరణ.
Achantagopalakrishna: అరటి పువ్వు ఆవ పెట్టి కూర
అరటిపువ్వు కూర:: అరటిపువ్వు — ఒకటి పసుపు — ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు — 8 పచ్చిమిరపకాయలు — 10 జీడిపప్పులు — 15 సెనగ పప్పు — ఒక టేబుల్ స్పూన్ మినపపప్పు — అర టేబుల్ స్పూన్ ఆవాలు — అర టీ స్పూన్ మెంతులు — 4 గింజలు ఇంగువ — పావు టీ స్పూన్ ఉప్పు — ఒక టీ స్పూన్ చిన్తపండురసం — ఒక టేబుల్ స్పూన్ ఆవపొడి — అర టీ స్పూన్ కరివేపాకు — 4రెమ్మలు నూనె — ఒక టేబుల్ స్పూన్ తయారుచేసే విధానం ;- ముందుగ అరటిపువ్వు ను వొలిచి ,అరటిపువ్వు లోని సన్నగా పొడవుగా వుండే పువ్వుల మధ్యలోని చందమామను ,అంగుళం పొడవుగా వుండే పొర ను తీసేయాలి . ఈ పని చాల టైం తీసుకుంటుంది . అలా మొత్తం పువ్వును బాగుచేసుకుని గ్రైన్దర్ లో వేసి ,పసుపు ,నూనె వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి . తరవాత అందులో చెడు,వగరు పోయే వరకు నీళ్ళు పోసి బాగా కడగాలి . కడిగిన తరువాత ఒక గిన్నెలో వేసి మునిగే వరకు నీళ్ళు పోసి ఉప్పు వేసి మెత్తగా ఉడకబెట్టాలి . ఉడికిన అరటిపువ్వు ను నీళ్ళు లేకుండా గట్టిగ పిండేసి పక్కన పెట్టుకోవాలి . ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి సెనగపప్పు ,...
Comments
Post a Comment