నాకు నచ్చిన, నేను వ్రాసే వాటిని ఇక్కడ ప్రచురిస్తాను, అటు తదుపరి వాటిని నా మొత్తం అన్ని సైట్స్ లోకి అవసరమైన చోటికి తరలిస్తాను, వీటిని పంచుకునేవారు నాతో కలవండి :)
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
ఈ కళాకండం మీద మిత్రులు పద్మార్పిత గారు మధురభాషణమీయగలరు.
సిమెంట్ తో చేసిన ఈ కొమ్మ బొమ్మ నాకు నచ్చింది.☺☺
చిత్రకారుల పేరు తెలియదు.
అరటిపువ్వు కూర:: అరటిపువ్వు — ఒకటి పసుపు — ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు — 8 పచ్చిమిరపకాయలు — 10 జీడిపప్పులు — 15 సెనగ పప్పు — ఒక టేబుల్ స్పూన్ మినపపప్పు — అర టేబుల్ స్పూన్ ఆవాలు — అర టీ స్పూన్ మెంతులు — 4 గింజలు ఇంగువ — పావు టీ స్పూన్ ఉప్పు — ఒక టీ స్పూన్ చిన్తపండురసం — ఒక టేబుల్ స్పూన్ ఆవపొడి — అర టీ స్పూన్ కరివేపాకు — 4రెమ్మలు నూనె — ఒక టేబుల్ స్పూన్ తయారుచేసే విధానం ;- ముందుగ అరటిపువ్వు ను వొలిచి ,అరటిపువ్వు లోని సన్నగా పొడవుగా వుండే పువ్వుల మధ్యలోని చందమామను ,అంగుళం పొడవుగా వుండే పొర ను తీసేయాలి . ఈ పని చాల టైం తీసుకుంటుంది . అలా మొత్తం పువ్వును బాగుచేసుకుని గ్రైన్దర్ లో వేసి ,పసుపు ,నూనె వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి . తరవాత అందులో చెడు,వగరు పోయే వరకు నీళ్ళు పోసి బాగా కడగాలి . కడిగిన తరువాత ఒక గిన్నెలో వేసి మునిగే వరకు నీళ్ళు పోసి ఉప్పు వేసి మెత్తగా ఉడకబెట్టాలి . ఉడికిన అరటిపువ్వు ను నీళ్ళు లేకుండా గట్టిగ పిండేసి పక్కన పెట్టుకోవాలి . ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి సెనగపప్పు ,...
వంకాయ-చిక్కుడు-అల్లంకారం : వంకాయను ఆహారంలో తరచూ తీసుకోవటం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే రక్త పోటు అదుపు లో ఉంటుంది. శరీరంలో ఉండే అధిక ఇనుమును తొలగిస్తుంది. పందిరి చిక్కుడులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. చిక్కుడు గింజలు తిన్నా కూడా చాల ఆరోగ్యం. ఈ చిక్కుడు కాయల్ని తినటం వలన డయేరియా, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇవి తినటం వలన ఆకలి బాగా తగ్గుతుంది. బరువు తగ్గాలి అనుకునే వారు వీటిని డైట్ లో తీసుకోవచ్చు. ( వీటి విషయంలో ఏవైనా వ్యత్యాసాలుంటే దయచేసి మీమీ వైద్యులని అడగండి. ఇవి తీసుకోండి : పావుకిలో వంకాయలు, చిక్కుడు కాయల ( నాలుగు పుంజీల చిక్కుడు, రెండు వంకాయలు)కి చంచాడు నూనె , పసుప చంచాడు రుచికోసం ఉప్పు , చంచాడు పోపుసామాను , ఎండుమిర్చి – 2 రెండు రెబ్బలు కరివేపాకు . అల్లం కారం కోసం : పచ్చిమిర్చి – 5, అంగుళం ముక్క అల్లం, జీలకర్ర 1 చంచాడు. ఇలా చేసుకోవాలి : ముందుగా అల్లం కారం కోసం పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కలిపి కచ్చాపచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. చిక్కుడు కా...
వ పప్పుధాన్యాలు:- . కప్పు పప్పు ద్వారా పద్దెనిమిది నుంచి ఇరవైగ్రాముల మాంసకృత్తులు అందుతాయి. సెనగలు:- వీటిల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. పీచుతోపాటూ ఆరోగ్యానికి మేలుచేసే కొలెస్ట్రాల్ని అందిస్తాయివి. వీటిలో మెగ్నీషియం, ఇనుము, క్యాల్షియం, జింక్ లాంటి పోషకాలుంటాయి. ఇవి ఎముకలకు మేలుచేస్తాయి. కప్పు సెనగలు తీసుకుంటే 18 నుంచి 22 గ్రాముల మాంసకృత్తులు అందుతాయి. సోయా: - సోయాలో ప్రొటీన్శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అదనంగా మరికొన్ని ఖనిజాలూ, విటమిన్లూ ఉంటాయి. ఈ గింజల్లో ఉండే పీచు జీర్ణవ్యవస్థ పనితీరు సజావుగా సాగేందుకు తోడ్పడుతుంది. కప్పు సోయా గింజల్ని తీసుకుంటే రోజువారీ అవసరాలకు సరిపడే ప్రొటీన్లు శరీరానికి అందుతుంది. సేకరణ.
Comments
Post a Comment