వంకాయ-చిక్కుడు-అల్లంకారం : వంకాయను ఆహారంలో తరచూ తీసుకోవటం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే రక్త పోటు అదుపు లో ఉంటుంది. శరీరంలో ఉండే అధిక ఇనుమును తొలగిస్తుంది. పందిరి చిక్కుడులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. చిక్కుడు గింజలు తిన్నా కూడా చాల ఆరోగ్యం. ఈ చిక్కుడు కాయల్ని తినటం వలన డయేరియా, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇవి తినటం వలన ఆకలి బాగా తగ్గుతుంది. బరువు తగ్గాలి అనుకునే వారు వీటిని డైట్ లో తీసుకోవచ్చు. ( వీటి విషయంలో ఏవైనా వ్యత్యాసాలుంటే దయచేసి మీమీ వైద్యులని అడగండి. ఇవి తీసుకోండి : పావుకిలో వంకాయలు, చిక్కుడు కాయల ( నాలుగు పుంజీల చిక్కుడు, రెండు వంకాయలు)కి చంచాడు నూనె , పసుప చంచాడు రుచికోసం ఉప్పు , చంచాడు పోపుసామాను , ఎండుమిర్చి – 2 రెండు రెబ్బలు కరివేపాకు . అల్లం కారం కోసం : పచ్చిమిర్చి – 5, అంగుళం ముక్క అల్లం, జీలకర్ర 1 చంచాడు. ఇలా చేసుకోవాలి : ముందుగా అల్లం కారం కోసం పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కలిపి కచ్చాపచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. చిక్కుడు కా...
Posts
అన్నమాచార్య సంకీర్తనలు : తే శరణమహం .
- Get link
- X
- Other Apps
68.త. తే శరణమహం తే శరణమహం శైశవకృష్ణ తే శరణం గతోస్మి|| దశవిధావతార ధర్మరక్షణమూర్తి దశమస్తకాసురదశన దశదిశాపరిపూర్ణ తవనీయస్వరూప దశావరణ లోకతత్త్వాతీత || సహస్రలోచన సంతతవినుత సహస్రముఖ శేషశయనా సహస్రకరకోటిసంపూర్ణతేజా సహస్రాదిత్య దివ్యచక్రాయుధా || అనంతచరణ సర్వాధారధేయ అనంతకరదివ్యాయుధా అనంతనిజకల్యాణగుణార్ణవ అనంత శ్రీవేంకటాద్రినివాసా ||
ఆధార్ లో రక్తవర్గం (Blood Group)
- Get link
- X
- Other Apps
ఆధార్ రక్త అవసరానికి కూడా ఆధారం కావాలి. నేడు అన్ని చోట్లా ఆధార్ అనుసంధానం కావాలంటున్నారు. ఒక సూచన . ::: ఆధార్ కార్డు లో రక్త వర్గం (Blood Group ) కూడా నమోదు చేస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. రమారమిగా ఉద్యోగం చేసే వారికి ఉండే గుర్తింపు కార్డుల మీద రక్త వర్గం నమోదయి ఉంటుంది. మరి ఉద్యోగం చేయని రైతుల, వ్యాపార వర్గ ప్రజలకి, విద్యార్థులకి, చిన్నపిల్లలకి, వృద్ధులకి ఉపయుక్తమైన విధంగా ఆధార్ కార్డుల కూడా రక్త వర్గం ఉండే విధంగా చర్యలు తీసుకుంటే మంచిదనిపిస్తోంది. .
- Get link
- X
- Other Apps
# జామకాయపచ్చడి . జామకాయ పచ్చడి చేసుకుందామనిపించింది . సాయంత్రం చేసే అవకాశం వచ్చింది. 1.ఒక పచ్చిజామకాయ తీసుకుని ముక్కలు చేసుకున్నాను. 2.స్టో మీద మూకుడు పెట్టి ఒక చంచాడు నూనె వేసి ఆ ముక్కలు అందులో వేసేను. 3.అవి కొద్దిగా వేగినవెంటనే కొద్దిగా చింతపండు చింతపండు, ఉప్పు వేసి మూతపెట్టేను. 4.రెండు నిమిషాల తరువాత చిటికెడు మెంతికారం, ఎర్రకారం వేసేసి మూతపెట్టేను. 5.ఇంకో రెండు నిమిషాల తరువాత దింపి చిన్న రోలులో ఆ మిశ్రమాన్ని వేసి దంపి ఆవాలు మెంతులు,కరివేపాకు,చిటికెడంత ఇంగువలతో పోపు పెట్టేను . వేడివేడి అన్నంలో కలుపుకుని తింటుంటే భలే ఉంది. రోట్లో వేసి దంపినందువలన రుచి మస్తుంది. మీరూ ఓసారి చేసుకుని తినేసి చెప్పండి
ఆరోగ్యం- పప్పులు.
- Get link
- X
- Other Apps
వ పప్పుధాన్యాలు:- . కప్పు పప్పు ద్వారా పద్దెనిమిది నుంచి ఇరవైగ్రాముల మాంసకృత్తులు అందుతాయి. సెనగలు:- వీటిల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. పీచుతోపాటూ ఆరోగ్యానికి మేలుచేసే కొలెస్ట్రాల్‌ని అందిస్తాయివి. వీటిలో మెగ్నీషియం, ఇనుము, క్యాల్షియం, జింక్ లాంటి పోషకాలుంటాయి. ఇవి ఎముకలకు మేలుచేస్తాయి. కప్పు సెనగలు తీసుకుంటే 18 నుంచి 22 గ్రాముల మాంసకృత్తులు అందుతాయి. సోయా: - సోయాలో ప్రొటీన్‌శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అదనంగా మరికొన్ని ఖనిజాలూ, విటమిన్లూ ఉంటాయి. ఈ గింజల్లో ఉండే పీచు జీర్ణవ్యవస్థ పనితీరు సజావుగా సాగేందుకు తోడ్పడుతుంది. కప్పు సోయా గింజల్ని తీసుకుంటే రోజువారీ అవసరాలకు సరిపడే ప్రొటీన్లు శరీరానికి అందుతుంది. సేకరణ.