Posts

Showing posts from January, 2016

ప్రేమా..ప్రేమా..

Image
మనసెందుకో ఒంటరయ్యింది.. మన అనే తోడు మాయమయ్యింది.. జత లేక జాగరణ అలవాటయ్యింది.. జలతారు వెన్నెల జాలితో జారిపోయింది.. నీ దాహం నాలో ఇంకా తీరలేకుంది.. అయినా నీ మోహం నాపై పడలేకుంది.. నా కల ఇప్పటికీ నిజమై నిలవలేకుంది.. నీ రూపుగా నా ఎదురుగా చూపలేకుంది. మనసెందుకో ఒంటరయ్యింది.. మన అనే తోడు మాయమయ్యింది.. జత లేక జాగరణ అలవాటయ్యింది.. జలతారు వెన్నెల జాలితో జారిపోయింది.. నీ దాహం నాలో ఇంకా తీరలేకుంది.. అయినా నీ మోహం నాపై పడలేకుంది.. నా కల ఇప్పటికీ నిజమై నిలవలేకుంది.. నీ రూపుగా నా ఎదురుగా చూపలేకుంది. ఎక్కడో లభించింది, ధన్యవాదాలు >

నీవుంటే నాకు విజయాలు వరిస్తాయి. నీవంటూ లేకుంటే అపజయాలు వెక్కిరిస్తాయి..

నీ కన్నుల కాంతిలో ఉదయాలు కన్పిస్తాయి.  నీ సవ్వడిలో కోయిల రాగాలు వినిపిస్తాయి. నీ సానిహిత్యంలో వసంతాలు దరికొస్తాయి. నీ కోసం నిరీక్షణలో యుగాలు క్షణమవుతాయి. నీ తలపుతోటి మనసుకు రెక్కలొస్తాయి. నీ పిలుపుతోటి మది భావాలు వెలికొస్తాయి నీవుంటే నాకు విజయాలు వరిస్తాయి. నీవంటూ లేకుంటే అపజయాలు వెక్కిరిస్తాయి.. నిశీధిని తరిమేసేందుకు మినుకుమంటూ ప్రయత్నించే మిణుగురులా... ఆశ చావని నా ప్రాణం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరెన్ని చెప్పినా వినని మూర్ఖుడిలా... నా మనసు నీకోసమే తపిస్తూ ఉంటుంది. భూమి ఆకాశాలు ఒకటైనా సాగరాలన్నీ ఏకమైనా... నిను వలచిన నా హృదయం నీకోసమే వేచి ఉంటుంది....

నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని

నీ ప్రతి తలపు నాకొక గెలుపై సుఖాలు తొణికెనులే నీ శృతి తెలిపే కోయిల పిలుపే తథాస్తు పలికెనులే గగనములా మెరిసి మెరిసీ పవనములా మురిసి మురిసీ నిను కలిసే క్షణము తలచీ అలుపు అనే పదము మరచీ వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే ...... కమ్మగా పాడే కోయిలనడిగాను, నీ తీయని మాటలతో నను మురిపించేది ఎపుడని చల్లగా వీచే చిరుగాలిని అడిగాను , నీ చల్లని చూపుతో నను తాకేది ఎపుడని... వర్షించే మేఘాన్ని అడిగాను , నీ నవ్వుల జల్లుల్లో నను తడిపేది ఎపుడని ... హాయిని పంచే వెన్నెలని అడిగాను , ఆ వెన్నల్లో హాయిగా ఊసులడేది ఎపుడని ... పరుగులు తీస్తున్న సెలయేటిని అడిగాను , నీ పరుగు నా కోసమేనా అని ... నాలో ఉన్న నా ప్రాణమైన నీకు తెలిపాను , నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని .
ఇద్దరి మధ్యా దూరం పెరిగిపోతుందని భ్రమపడుతుంటావు కాని దగ్గరగా ఉన్న మనం మనం  గా గడిచిన అపురూప క్షణాలను ఏం చేస్తావు1 వెలకట్టలేని భావాలను  పంచుకున్న మనసులు కనపించని వ్యధలను సృష్టించుకుంటూ మనల్ని మనమే మోసగించుకోవడం మానవ నైజంకనే కాదు ! ఇద్దరి ఆలోచనలూ వేరైన మనదైన లోకంలో ఒక్కటిగా విహరిస్తూ గడిచిన క్షణాలన్నింటిని ఒక్కసారి దోసిలిలోకి ఒడిసిపడితే.. వేళ్ళ సందుల్లోంచి జ్ఞాపకాలు జారిపోతాయేమోనని మన అంతులేని ప్రేమను అడ్డుగా వేశా...అయిన నువ్వు జారిపోతున్నవుగా :'(  దూరం పోకు
కనుమూసిన నయనపు చీకటి మసగకు వెలుగును పంచే ప్రేమ నిధీ చిగురాకుల సొబగుల జాబిలి పలుకుల చెలిమిని చేర్చే మానస సఖీ ! పరిమళ పువ్వుకు నవ్వును నేర్పిన పాలబుగ్గల కవితల నిధీ తలపులసిగ్గును వలపుల మొగ్గగ మార్చిన వన్నెల ప్రియతమ సఖీ ! చల్లని వెన్నెల,పూల సుగంధపు ప్రణయపు మధువుకు మాటలు నేర్పిన పదముల నిధీపిల్లతెమ్మెరల, కోయిల పాటల శ్రావ్య గళపు మాధురి తెలిపిన గాన సఖీ ! మందహాసమున శాంతిని కలిపి బృందరీతులను ఆదరించినా స్నేహనిధీ కలిమి లేములకు చెలిమిని చేర్చి గృహమున ప్రేమ వెలుగునే పంచిన లావణ్య సఖీ ! ఎదయెదలను కలిపి, అధరపు మధువును ప్రేమగ పంచి స్వర్గపు తలుపులు తెరిపించు నా యవ్వన నిధీ! కరముల స్పర్శను కలిపి, మాతృత్వపు మాధుర్యము తెలిపి గంధపు వర్ణపు కోవెల దేవతగ కనిపించు నా జీవిత సఖీ ! ఎచాడున్నావు నా సఖీ, కానారావా  ఓ పరి 

అమ్మ

Image
పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ ! ఆ అమ్మ ఒడిలో మొదలైయింది ఈ జననం  ...!! ఆమ్మ ....అంటే ...అమ్మే ..! అమ్మకు సరి రారు వేరెవ్వరు ! ఆ అమ్మకు సేవ చెసే భాగ్యం అందరికి దొరకదు దొరికినా కొండరు వినియోగించుకోలేరు ..! అలాంటి జీవితాలకి అర్దం లెదు ..! ప్రపంచంలో అమ్మకు మించిన దైవం లేదు.  అమ్మ అమ్మే మనకు కొండంత అండ.

నిన్నే తలుస్తూ పిలుస్తున్నా మదిలో..

Image
నిన్నే తలుస్తూ పిలుస్తున్నా మదిలో.. గడిచిన క్షణాలు నీ స్నేహాన్ని గుర్తు చేస్తున్నాయి.. నీతో చెలిమిని జీవితాంతం కొనసాగించమంటున్నాయి.. స్వచ్ఛంగా పలికిన నీ మాటలు పదేపదే వినబడుతున్నాయి .. నీవిచ్చన గౌరవం నా జీవితంలో నిజమైన సంపదైయింది నను వెన్ను తట్టి ప్రోత్సహించిన అమృతం నీవు అమ్మలా ఆదరించిన అనురాగపు చినుకువు నీవే.. నీవు తోడైతే నా జీవితం మొత్తం పరిపూర్ణం.. నలుగురికీ ప్రేమ పంచే నీస్వభావం నాక్కాలి ఎదలోపలి చీకటిని దూరం చేసే నీ స్నేహం వెలుగవ్వాలి.. నా జీవితంలోకి వస్తావుకదూ! మరి ఈ జన్మలో ఎలా సాధ్యం , అందాకా  తోడువై ఉంటావు కదూ!