రాయాలని ఉంది నీకొక లేఖ
కట్టలు తెంచుకు వస్తున్న నా కన్నీటికి ఆనకట్ట కట్టలేక...
ఇకపై నిన్ను చూస్తానో లేదో అన్న బాధ గుండె లోతుల్లో దాచుకోలేక...
నువ్వంటే నాకు ఎంత అనురాగమో నీకు చెప్పలేక...
ఈ నా ఆవేదనను ఎవరితో పంచుకోలేక..
రాయాలని ఉంది నీకొక లేఖ

ఒంటరిగా ఉండలేక...
ఎవరినీ కలవలేక..
కలసినా మాట్లాడలేక..
ఆకలి లేక..
నిద్ర రాక..
నిన్ను మరచిపోలేక - అది నాకు చేత కాక..
రాయాలని ఉంది నీకొక లేఖ ..

తడిసిన కనులతో,
అదురుతున్న గుండెతో,
వణుకుతున్న చేతులతో,
బొంగురుపోయిన గొంతుతో ..
రాయాలని ఉంది నీకొక లేఖ ..

నా ఈ బాధకు నువ్వు కారణం కాదు అని తెలిసినా..
అందులో నీ తప్పేమీ లేదని తెలిసినా..
నా వల్ల నువ్వు కూడా బాధ పడుతున్నవని తెలిసినా...
నువ్వు నా స్నేహాన్ని వదలవని తెలిసినా..
మనసు ఒప్పుకోక రాయాలని ఉంది నీకొక లేఖ..

నా ఈ పిచ్చి రాతలతో
నిన్ను బాధిస్తే కోపగించక మన్నించుమా నన్నిక

Comments

Popular posts from this blog

Achantagopalakrishna: అరటి పువ్వు ఆవ పెట్టి కూర

ఆరోగ్యం- పప్పులు.