హయ్ ఫ్రెండ్స్ ...
ప్రేమికులరోజు మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకుని ప్రేమించానని చెప్పెస్తే జీవితాంతం ప్రేమ ఉన్నట్టేనా, కాదని నేననుకుంటాను ...
నిజమైన ప్రేమ ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ మనసులోనే ఉంటుంది, మనసంతా ఉంటుంది ...
ప్రేమ = రెండక్షరాలు, అది మూడు ముళ్లై, ఏడడుగులుగా నిలవాలంటే కావలసింది ఇద్దరు మనుషులు మాత్రమే కాదు ఇష్టం, అభిమానం, నమ్మకం అన్నిటిని మించి ప్రేమతో నిండిన రెండు మనసులు ...
రెండు మనసుల కలయిక ప్రేమ. ప్రేమకు ప్రేమించే మనసుతో పాటు ఆలోచన, ధైర్యం అన్నిటిని మించి నమ్మకం కావాలి ...
మంచి చేస్తే అందరూ అభినందిస్తారు కాని తప్పు చేసినా కూడా మందలించేది, ప్రేమించేది నా అనుకునే మన వాళ్ళు మాత్రమే, అవునా కాదా ప్రేమికులారా,
నా పెళ్ళి జరగబోతుంది ఇంకో రెండు నెలల్లో. పెళ్లి తరువాత నీ ప్రపంచం మారనివ్వను నీ ప్రపంచంతో పాటే నిన్ను ప్రేమించాను అని తను నమ్మకంగా చెబుతూ ఉన్నా కూడా ఎందుకో ఏదో బెంగ.చుట్టూ ఉన్న పరిస్థితులు ఎపుడూ తనని ఇలాగే ఉండనివ్వవేమో అనే బెదురు.మీ నాన్న చనిపోయాక నువ్వు తప్ప వేరే ప్రపంచం నాకు తెలియదు నువ్వు వెళ్లిపోయాక ఎలా ఉండాలో అని అమ్మ చెమ్మగిల్లిన తన కళ్లను తుడుచుకుంటుంటే చూసి నా మనసు పడిన ఆవేదనను అక్షరాలలో వ్యక్తం చేయాలంటే ప్రపంచంలోని అన్ని భాషలలోని అక్షరాలు సరిపోవు.అక్కడ అమ్మంత ప్రేమగా చూసుకునేవారు, అమ్మంత ఓర్పుగా నన్ను భరించేవారు,కోపంలో నేను చేసే పనులను అమ్మలా క్షమించేవారు, అమ్మలా నా తప్పులను సరిదిద్దేవారు, నేను బాధపడితే అమ్మ లా నన్ను ఒడిలో పడుకోపెట్టుకుని నా తల నిమిరేవారు,నేను సరిగా తిన్నానో లేదో అని ప్రతి క్షణం పట్టించుకునేవారు, నేను కొన్ని సార్లు విసుక్కుంటున్నా పట్టించుకోకుండా నా కోసం ప్రతి క్షణం ఆలోచించేవారు, నేను బయటకి చెప్పకపోయినా నా మనసులో ఉన్నదంతా తెలుసుకునేవారు,ఎటువంటి షరతులు లేకుండా అమ్మలా నన్ను ప్రేమించగలిగే వారు అక్కడ ఉంటారా?నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంటి గేట్ దగ్గర నా కోసం అమ్మలా ఎదురు చూసేవారు అక్కడ ఉంటారా?
ఈ ఇంట్లోకి నాకు మూడున్నరేళ్ల వయసులో వచ్చాను.ఈ ఇంటిలోని అణువణువు ఎంత ఇష్టం నాకు.ఇంటి ముందు రంగురంగుల పూలతో ఉన్న మొక్కల మధ్య తిరగటం, సెలవు రోజుల్లో నా గది అద్దాలలో నుంచి సూర్యకాంతి చూస్తూ పుస్తకాలు చదువుకుంటుంటే ఎంత హాయిగా ఉండేది.అక్కచెల్లెల్లు, అన్నాతమ్ములు లేకపోయినా ఈ ఇంట్లో, ఇన్నేళ్లలో ఎపుడూ ఒక్క క్షణమైనా ఒంటరిగా అనిపించలేదు.ఈ ఇంటిని వదిలి వెళ్లాలంటే ఎంత బెంగగా అనిపిస్తుందో.మొన్న పక్కింటి అమ్మాయి నీ గదిలో అంటూ నాతో ఏదో చెబుతున్నపుడు పిన్ని మధ్యలో కలగచేసుకుని ఇంకా తన గది ఏంటి అది ఇంకో రెండు నెలల్లో వెళ్లి పోతుంది ఇకపై అది తన గది కాదు అని నా గురించి అన్నపుడు మనసులో ముల్లు గుచ్చుకున్నంత బాధ.
ఈ ఊరు,గుడి, ఊరి చెరువు,పరిచయమైన మనుషులు వీరందరినీ వదిలి వెళ్లాలి.
అక్కడ ఇక్కడలా ఉండగలనా? ఇక్కడలాగ కోపమొస్తే బయటకు మనసులో ఉన్నదంతా అనేసేటట్టు కాకుండా అక్కడ సహనంగా ఉండగలనా? ఆ కోపాన్ని మనసులో అదిమి పెట్టుకోవటం వలన వచ్చే అసహనాన్ని బయటకు కనపడకుండా ఉంచగలనా? ఇక్కడ ఒక్కదాన్నే కాబట్టి పంచుకోవటం అలవాటు లేని నేను అక్కడ సమూహంలో ఇమడగలనా?ఇక్కడ చేసినట్లు అక్కడ చిన్నపిల్లలా మారాం చేయలేను కదూ.నాకు ఆకలి లేదు తినను అంటే నా తల్లివి కదూ రెండు ముద్దలు తినరా అంటూ అమ్మలా నా వెనుక అన్నం పళ్లెం పట్టుకుని తిరుగుతూ నాకు తినిపించేవారు, ఇంట్లో ఎంత మంది ఉన్నా ఎవరూ చూడకుండా దేవుడికి ప్రసాదంగా పెట్టిన ఎండుద్రాక్ష పళ్లు చీర కొంగు కి కట్టుకుని వచ్చి నాకు పెద్దమ్మ లా ప్రేమగా ఇచ్చే వారు అక్కడ ఉండరు కదూ.
నా ఆత్మ గౌరవాన్ని పొగరు అని భ్రమపడని వారు అక్కడుంటారా? చదువుకి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే వాతావరణం, అబద్ధాలకు, అప్పు అనే పదానికి ఆమడ దూరంలో ఉండే మనుషులు,వేకువఝామునే లేచే అలవాటున్న వారు అక్కడ ఉంటారా?
బెంగగా ఉంది.ఒక్కగానొక్క కొడుకుకి భార్యగా ఆ ఇంట్లో అడుగు పెట్టబోయే నేను తన అమ్మానాన్నల మనసు నొప్పించకుండా నడుచుకోగలనా అని. పెళ్లి అయిపోయిన తన అక్క చెల్లెల్లు వారి పుట్టింటికి ఇంతకు ముందు లాగానే ఎటువంటి సంకోచం లేకుండా రాగలిగే వాతావరణం ఆ ఇంట్లో ఉంచగలనా అని.జీవితంలో ఎదురయ్యే వేర్వేరు పరిస్థితుల ప్రభావం నా మనసు ఉనికి పై పడకుండా చూసుకోగలనో లేదో అని.
బెంగగా ఉంది.నేను వెళ్లాక కూతురిగా, స్నేహితురాలిగా అమ్మ ని జాగ్రత్తగా చూసుకునే నేను పక్కన లేకుండా అమ్మ ఎలా ఉంటుందో అని.
అన్నింటి కంటే బెంగగా ఉంది నా పెళ్ళి సమయంలో అమ్మ,నాన్న కలిసి చేయవలసిన కన్యాదానాన్ని వేరే ఎవరో చేస్తుంటే బాధతో నాన్న ని గుర్తు చేసుకుని కన్నీరు తుడుచుకునే అమ్మని పట్టుకుని ఆ క్షణంలో ఎవరు ధైర్యం చెబుతారో

Comments
Post a Comment