మధురం నీ ప్రేమ మధురం రాధా కృష్ణ

కాలాలు మారొచ్చు క్షణాలు జారొచ్చు, కానీ నా యెద నదిలో స్వేచ్చగా ఈదులాడే

నీ ఙ్ఞాపకాల తడి కూడా ఆరలేదు. రేయంతా స్వప్నాల జల్లులు కురిపిస్తు నా ఇష్టాలన్నీ

చేతులై నిన్ను
 చుట్టుకుంటుంటే రెక్కలు విప్పిన నేత్రాలు తమకాన్ని పెంచాయి.
గాలిలో గుసగుసలా నీ స్వరం నన్ను పిలుస్తోంటే విరబూసిన మల్లెల ఉషస్సులు నన్ను

తడుముతూనే ఉన్నాయి. 
చంద్రుని వెన్నెల తునకలు నా మేని తాకుతుంటే మది నిండిన

సంతోషం ఉత్తుంగతరంగమౌతోంది. 
వీడి పోయిన కాలం సమయంతో దాగుడు మూతలాడి

సంపెంగ సోయగాలతో వింజామరలు 
వీస్తూ మన కోసం సౌరభాల వసంతమై తిరిగివచ్చి
ఇరు హృదయాల మధ్య వారధిని నిర్మిస్తోంది.మన మనసు తలపుల గడియల
తీసిపరవశించిపోదాం రా మనదైన ఈ మాధుర్యాన, తిరిగి మునిగిపోదాం కృష్ణా !!!!

Comments

Popular posts from this blog

Achantagopalakrishna: అరటి పువ్వు ఆవ పెట్టి కూర

ఆరోగ్యం- పప్పులు.