Posts

Showing posts from 2017
Image
# జామకాయపచ్చడి .  జామకాయ పచ్చడి చేసుకుందామనిపించింది . సాయంత్రం చేసే అవకాశం వచ్చింది.  1.ఒక పచ్చిజామకాయ తీసుకుని ముక్కలు చేసుకున్నాను. 2.స్టో మీద మూకుడు పెట్టి ఒక చంచాడు నూనె వేసి ఆ ముక్కలు అందులో వేసేను. 3.అవి కొద్దిగా వేగినవెంటనే కొద్దిగా చింతపండు చింతపండు, ఉప్పు వేసి మూతపెట్టేను. 4.రెండు నిమిషాల తరువాత చిటికెడు మెంతికారం, ఎర్రకారం వేసేసి మూతపెట్టేను. 5.ఇంకో రెండు నిమిషాల తరువాత దింపి చిన్న రోలులో ఆ మిశ్రమాన్ని వేసి దంపి ఆవాలు మెంతులు,కరివేపాకు,చిటికెడంత ఇంగువలతో పోపు పెట్టేను . వేడివేడి అన్నంలో కలుపుకుని తింటుంటే భలే ఉంది.  రోట్లో వేసి దంపినందువలన రుచి మస్తుంది. మీరూ ఓసారి చేసుకుని తినేసి చెప్పండి

ఆరోగ్యం- పప్పులు.

Image
వ పప్పుధాన్యాలు:- . కప్పు పప్పు ద్వారా పద్దెనిమిది నుంచి ఇరవైగ్రాముల మాంసకృత్తులు అందుతాయి.  సెనగలు:-  వీటిల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. పీచుతోపాటూ ఆరోగ్యానికి మేలుచేసే కొలెస్ట్రాల్‌ని అందిస్తాయివి. వీటిలో మెగ్నీషియం, ఇనుము, క్యాల్షియం, జింక్‌ లాంటి పోషకాలుంటాయి. ఇవి ఎముకలకు మేలుచేస్తాయి. కప్పు సెనగలు తీసుకుంటే 18 నుంచి 22 గ్రాముల మాంసకృత్తులు అందుతాయి. సోయా: -  సోయాలో ప్రొటీన్‌శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అదనంగా మరికొన్ని ఖనిజాలూ, విటమిన్లూ ఉంటాయి. ఈ గింజల్లో ఉండే పీచు జీర్ణవ్యవస్థ పనితీరు సజావుగా సాగేందుకు తోడ్పడుతుంది. కప్పు సోయా గింజల్ని తీసుకుంటే రోజువారీ అవసరాలకు సరిపడే ప్రొటీన్లు శరీరానికి అందుతుంది. సేకరణ.
Image
ఈ కళాకండం మీద మిత్రులు పద్మార్పిత గారు మధురభాషణమీయగలరు. సిమెంట్ తో చేసిన ఈ కొమ్మ బొమ్మ నాకు నచ్చింది.☺☺ చిత్రకారుల పేరు తెలియదు.

Achantagopalakrishna: అరటి పువ్వు ఆవ పెట్టి కూర

Image
  అరటిపువ్వు కూర:: అరటిపువ్వు — ఒకటి పసుపు — ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు — 8 పచ్చిమిరపకాయలు — 10 జీడిపప్పులు — 15 సెనగ పప్పు — ఒక టేబుల్ స్పూన్ మినపపప్పు — అర టేబుల్ స్పూన్ ఆవాలు — అర టీ స్పూన్ మెంతులు — 4 గింజలు ఇంగువ — పావు టీ స్పూన్ ఉప్పు — ఒక టీ స్పూన్ చిన్తపండురసం — ఒక టేబుల్ స్పూన్ ఆవపొడి — అర టీ స్పూన్ కరివేపాకు — 4రెమ్మలు నూనె — ఒక టేబుల్ స్పూన్ తయారుచేసే విధానం ;- ముందుగ అరటిపువ్వు ను వొలిచి ,అరటిపువ్వు లోని సన్నగా పొడవుగా వుండే పువ్వుల మధ్యలోని చందమామను ,అంగుళం పొడవుగా వుండే పొర ను తీసేయాలి . ఈ పని చాల టైం తీసుకుంటుంది . అలా మొత్తం పువ్వును బాగుచేసుకుని గ్రైన్దర్ లో వేసి ,పసుపు ,నూనె వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి . తరవాత అందులో చెడు,వగరు పోయే వరకు నీళ్ళు పోసి బాగా కడగాలి . కడిగిన తరువాత ఒక గిన్నెలో వేసి మునిగే వరకు నీళ్ళు పోసి ఉప్పు వేసి మెత్తగా ఉడకబెట్టాలి . ఉడికిన అరటిపువ్వు ను నీళ్ళు లేకుండా గట్టిగ పిండేసి పక్కన పెట్టుకోవాలి . ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి సెనగపప్పు ,...

Science.

Image
హయ్ ఫ్రెండ్స్ ...ప్రేమికులరోజు మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకుని ప్రేమించానని చెప్పెస్తే జీవితాంతం ప్రేమ ఉన్నట్టేనా, కాదని నేననుకుంటాను ...నిజమైన ప్రేమ ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ మనసులోనే ఉంటుంది, మనసంతా ఉంటుంది ...ప్రేమ = రెండక్షరాలు, అది మూడు ముళ్లై, ఏడడుగులుగా నిలవాలంటే కావలసింది ఇద్దరు మనుషులు మాత్రమే కాదు ఇష్టం, అభిమానం, నమ్మకం అన్నిటిని మించి ప్రేమతో నిండిన రెండు మనసులు ...రెండు మనసుల కలయిక ప్రేమ. ప్రేమకు ప్రేమించే మనసుతో పాటు ఆలోచన, ధైర్యం అన్నిటిని మించి నమ్మకం కావాలి ...మంచి చేస్తే అందరూ అభినందిస్తారు కాని తప్పు చేసినా కూడా మందలించేది, ప్రేమించేది నా అనుకునే మన వాళ్ళు మాత్రమే, అవునా కాదా ప్రేమికులారా,

Mothers day 720p HD

Mothers day 720p HD

Image
చక్కటి ఔషధం వెల్లుల్లి వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. గాయాలకు, చర్మ వ్యాధులకు, ఫ్లూ, అల్సర్, రక్తపోటు, పెద్దపేగు క్యాన్సర్, జలుబు, మూత్రపిండాల వ్యాధులకు, బ్లాడర్ సమస్యలకు వెల్లుల్లి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లితో చేసుకున్న సిరప్ దగ్గుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. మరిగే నీళ్లలో చిన్న వెల్లుల్లి ముక్క వేసి పన్నెండు గంటల పాటు నానబెట్టాలి. తరువాత కొంచెం పంచదార కలుపుకుని తీసుకుంటే దగ్గు ఇట్టే మాయమవుతుంది. రుచిగా ఉండాలని కోరుకునే వారు కొంచెం తేనెను కలుపుకోవచ్చు. గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారు వెల్లుల్లి కలిపిన టీ తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వెల్లుల్లి ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో సహాయపడుతుంది. చెవిపోటుతో బాధపడేవారు వెల్లుల్లి ముక్కను తీసుకుని ఆలివ్ ఆయిల్‌తో కలిపి వేడి చేసుకుని మిశ్రమం చల్లారిన తరువాత చెవిలో వేసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి తెగిన చోట, గాయాలకు రాసుకోవచ్చు. చర్మం ఎర్రగా మారి ఇరిటేషన్‌తో బాధపడుతున్న వారు, ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు వెల్లుల్లి పేస్టు రాసుకుంటే నయమవుతుంది. వెల్లుల్ల...
Image
తెలుగులో మాట్లాడండి.
Image
నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తోంది పెదాలలో మౌనం నన్నే అపేస్తున్నది. మనసునేమో దాచమన్నా అస్సలేమో దాచుకోదు నిన్ను చూస్తే పొద్దు పోదు చూడకుంటే ఊసుపోదు ఈ వైనం ఇంత కాలం నాలోనే లేదుగా నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదెలాగ. ప్రతి జన్మలోన నీతో ప్రేమలోన ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా
Image
నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తోంది పెదాలలో మౌనం నన్నే అపేస్తున్నది ఓ.. మనసునేమో దాచమన్నా అస్సలేమో దాచుకోదు నిన్ను చూస్తే పొద్దు పోదు చూడకుంటే ఊసుపోదు ఈ వైనం ఇంత కాలం నాలోనే లేదుగా నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదెలాగ ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా .
Image
నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను మరువలేను నిన్ను నేను, నీవు గుర్తుకురానే ఇలా అవుతాను. అనుకుని అనుకోగానే సరాసరి ఎదురవుతావు వేరే పనేం లేదా నీకు నన్ను వదలవు నాకు నీ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా ఈ లోకం కొత్తగుంది సీతాకోకచిలుకలా ఎగిరిపోవాలని ఉంది 👀👀👀👀👀👀👀👀👀
Image
వ్యాఖ్యను నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా ప్రతి జన్మలోన నీతో ప్రేమలోన ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా నచ్చావే.. నచ్చావే.. ఓ..  నచ్చావే.. నచ్చావులే..  జోడించు
Image
చల్లని వెన్నెల స్పర్శకు మురిసిన కలువ రేకులు ఎదను తడిమి మత్తును జల్లగా....! మూతపడిన కన్నుల కలలో విరిసిన నీ సుందర రూపం, తారల అలలా నేల జారగా...! మూగమనసుల అసహజ పరిమళాలు, గూడు చేసుకున్నబాసలు ఆలపించలేని హిందోళరాగాలు; వెనుతిరిగిన క్షణాల మెలికల ఆల్లికలో ఓ వయనం చొరవచూపి . ఏకాంతముగా మదినల్లుకున్నరాతిరి సందేశాలు, రాసిన ప్రేమ పుస్తకం చదివిన మనసు ఒంపిన జ్ఞాపకాల మెరుపులు ...నివేదిస్తున్న మౌన సంతకాలు మిగిల్చిన అక్షర నీరాజనపు గురుతులు చెరగని ఊహావెశపు మధురిమల మౌనముద్రలు లెక్కపెడుతున్న, కాంతి లేఖల కలువ కాగితాల పై ఏ నిమిషమో తిరిగి విరచించనా అలనాటి మన ప్రేమకధ మౌనంగా ఓ హృదయమా ...అనుకుంటూ నిన్నూహిస్తూ నే రాస్తున్నప్రతి ప్రేమకావ్యమూ చరిత్రలు చూడని సువర్ణ ద్వీపములో, ఇరువురి సప్త జన్మల సాన్నిహిత్యానికి ..... వారధి కడుతూ జన్మజన్మకి నిన్నే ఆరాధిస్తున్నా .
Image
కరిగిపోలేదు నీ జ్ఞాపకం కాలం తిరిగొస్తే ఎంత బాగుణ్ణు నిను తలచి తలచి నిలిచిపోతే నీ తీయటి జ్ఞాపకానికి విలువలేదు . ఆగిపోదెన్నడూ వర్తమానములో కూడా నీ వందించిన జ్ఞాపకం '' అయినా తిరిగిరాని వాటి మీదే నాకెందుకింత ఆరాటం , కష్టమయినా సుఖఃమయినా నీ వందించిన తీయటి జ్ఞాపం మరుపురాకున్నదీ